Telangana: గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని తనువు చాలించింది. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి మండలం కొత్లాపూర్లోని జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలలో జరిగింది. ఆ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని స్వాతి శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. వెంటనే సిబ్బంది చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆ విద్యార్థిని చనిపోయి ఉన్నదని ఆసుపత్రి వైద్యులు తేల్చి చెప్పారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నది.
