KTR ACB Inquiry: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి ఆయనపై విచారణ చేపట్టేందుకు తెలంగాణ గవర్నర్ అధికారికంగా అనుమతి మంజూరు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసు నిర్వహణలో జరిగినట్లు ఆరోపించబడుతున్న నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
గవర్నర్ అనుమతితో, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) త్వరలోనే ఈ కేసులో కేటీఆర్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేయనుంది అని తెలుస్తోంది ఈ కేసులో కేటీఆర్‌ను ఏ-1 (ముఖ్య నిందితుడు)గా, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ఏ-2గా ఏసీబీ పేర్కొంది. ఇప్పటికే కేటీఆర్ ఈ కేసు విషయంలో ఏసీబీ విచారణకు నాలుగు సార్లు హాజరయ్యారు. ఈ కేసులో ఏ-2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు ఇప్పటికే కేంద్రంలోని డీఓపీటీకు లేఖ రాశారు.
ఇది కూడా చదవండి: Saailu: నెగెటివ్ టాక్ వస్తే, అమీర్‌పేట్ సెంటర్లో అర్ధనగ్నంగా తిరుగుతా.. షాకింగ్ ఛాలెంజ్
గవర్నర్ అనుమతి నేపథ్యంలో, చార్జ్‌షీట్ దాఖలుకు ముందు ఏసీబీ అధికారులు మరోసారి కేటీఆర్‌ను లేదా ఇతర కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది.ఈ కేసుపై గవర్నర్ అనుమతి లభించడంతో, రాజకీయ వర్గాలలో మరియు పరిపాలనా వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ త్వరలో దాఖలు చేయబోయే చార్జ్‌షీట్‌తో ఈ కేసు విచారణ కీలక మలుపు తిరగనుంది.
