Raja Saab: ప్రభాస్ తో మారుతి తీస్తున్న తాజా చిత్రం రాజాసాబ్. ఈ సినిమాపైన ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కానీ సినిమా నుండి ట్రైలర్ తప్ప మరో అప్డేట్ రాలేదు మధ్యమధ్యలో ఫెస్టివల్స్ కి ఒక్క పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు సినిమా యూనిట్.
ట్రైలర్ రిలీజ్ అయి నెలలు గడుస్తున్నా మరో అప్డేట్ లేదు.. ఇదిలా ఉంటే ప్రొడ్యూసర్స్ ప్రెస్‌మీట్ పెట్టిన ప్రతిసారి ఏదో ఒకటి చెపుతూనే ఉన్నారు. అందులో భాగంగానే రిలీజ్ డేట్, ఫస్ట్ సింగల్ డేట్ చెప్పారు కానీ ఇంతవరకు సాంగ్ రిలీజ్ కాలేదు. ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు అప్డేట్ కోసం.
తాజాగా ఇండస్ట్రీలో వస్తున్న సమాచారం ఏంటిదంటే.. ఈ సినిమాలో జాతర సాంగ్ ఉంది అని ఈ సాంగ్ తో ఫ్యాన్స్ కి పూనకాలు రావడం పక్క అని దర్శక నిర్మాతల నమ్మకం. ఇది నిజమో కాదో సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు.
ఇప్పటికే సినిమాకి సంబందించిన రెండు సాంగ్స్ రెడీ చేసి రెడీ గా ఉంచారు అని టాక్. హీరో ఈ పాటలని చూసి దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే దానిని ఈ నెల ఆఖరిలోగా విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది.
రాజాసాబ్ సినిమాలో మొత్తం 5 సాంగ్స్ ఉన్నాయి అందులో ఒక్కటి రీమిక్స్ సాంగ్ ఇంకో సాంగ్ ని రెండో వెర్షన్స్ అంటే మేల్ ఇంకా ఫిమేల్ వెర్షన్ లో ఉందని తెలుస్తుంది. సినిమా నుండి అప్డేట్ రావడం లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం రోజురోజుకి కొత్త న్యూస్ వస్తుంది సినిమాపైన
