PM Kisan: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతమిళనాడులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అయితే, ఈ పర్యటనలో ప్రధానంగా ఆయన దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించనున్నారు.ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద అర్హులైన రైతులకు సంబంధించిన ఆర్థిక విడత నిధులను ప్రధాని మోదీ ఈరోజు విడుదల చేయనున్నారు. సుమారు 10 కోట్ల మందికి పైగా రైతు కుటుంబాలకు సంబంధించి, రూ.18,000 కోట్ల నిధులను సింగిల్ క్లిక్ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఈ నిధుల విడుదల ద్వారా దేశంలోని కోట్లాది మంది రైతులు ముఖ్యంగా కరోనా సంక్షోభం తర్వాత ఆర్థికంగా బలోపేతం అవుతారని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది. తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు రోడ్డు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో ఇప్పటికే పూర్తయిన కొన్ని కీలక ప్రాజెక్టులను కూడా ఆయన దేశానికి అంకితం చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Sathya Sai Baba: పుట్టపర్తిలో బాబా శత జయంత్యుత్సవాలు.. 9.2 కిలోల బంగారంతో సత్యసాయి విగ్రహం
తమిళనాడులో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులు రూపొందించబడ్డాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలతో, ప్రముఖులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. తమిళనాడులోని రైతులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఈరోజు ప్రధాని చేసే ప్రసంగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
