Amit Shah Helicopter Checked: ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం మహారాష్ట్రలోని హింగోలికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ అధికారులు హెలికాప్టర్‌లో ఉంచిన బ్యాగులు, ఇతర వస్తువులను పరిశీలించారు. అధికారులు ఈ సంఘటనను వీడియోలు తీశారు.
షా తన హెలికాప్టర్ పరిశోధనకు సంబంధించిన సమాచారాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఈరోజు, మహారాష్ట్రలోని హింగోలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో, ఎన్నికల సంఘం అధికారులు నా హెలికాప్టర్‌ను తనిఖీ చేశారు. నిష్పక్షపాత ఎన్నికలు, ఆరోగ్యకరమైన ఎన్నికల విధానంపై బీజేపీకి విశ్వాసం ఉంది. బీజేపీ గౌరవప్రదమైన ఎన్నికల సంఘం రూపొందించిన అన్ని నిబంధనలను కూడా అనుసరిస్తుంది అంటూ తన పోస్ట్ లో అమిత్ షా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Petrol: బావిలో నీటికి బదులుగా పెట్రోల్.. ఎగబడిన జనం.. విషయం ఏమిటంటే
Amit Shah Helicopter Checked: ఎన్నికల సంఘం అధికారులు నవంబర్ 11న యవత్మాల్‌లో, నవంబర్ 12న ఉస్మానాబాద్‌లో ఉద్ధవ్ ఠాక్రే బ్యాగును చెక్ చేశారు. అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ- చివరిసారి ప్రధాని మోదీ హెలికాప్టర్‌లో సోదాలు జరిగినప్పుడు, ఒడిశాలో ఒక అధికారిని సస్పెండ్ చేశారు. మీరు నా బ్యాగ్‌ని తనిఖీ చేసారు, ఫర్వాలేదు కానీ, మోడీ-అమిత్ షాల బ్యాగ్‌లు కూడా చెక్ చేయాలని అధికారులకు సవాల్ విసిరినా సంగతి తెలిసిందే.
आज महाराष्ट्र की हिंगोली विधानसभा में चुनाव प्रचार के दौरान चुनाव आयोग के अधिकारियों के द्वारा मेरे हेलिकॉप्टर की जाँच की गई।
भाजपा निष्पक्ष चुनाव और स्वस्थ चुनाव प्रणाली में विश्वास रखती है और माननीय चुनाव आयोग द्वारा बनाए गए सभी नियमों का पालन करती है।
एक स्वस्थ चुनाव… pic.twitter.com/70gjuH2ZfT
— Amit Shah (@AmitShah) November 15, 2024