Businessman: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో మర్చిపోలేని కల్ట్ హిట్ “బిజినెస్‌మ్యాన్”. ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 2012లో రిలీజ్ అయి బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు రీ-రిలీజ్‌కి సిద్ధమవుతోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మహేష్ సూర్య భాయ్ పాత్రలో అదరగొట్టాడు. థమన్ సంగీతం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రతి పాట మంచి బీట్స్‌తో యూత్‌ని ఆకట్టుకుంది. మెగా ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్‌లో దేశవ్యాప్తంగా గ్రాండ్ రీ-రిలీజ్ జరుగుతోంది. నవంబర్ 29న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. మహేష్ మొదటి సినిమా “నీడా” రిలీజ్ తేదీ కూడా ఇదే కావడం విశేషం. ఖలేజా రీ-రిలీజ్ సక్సెస్ తర్వాత ఈసారి మరింత స్క్రీన్లు పెంచారు. అనేక నగరాల్లో 4K ప్రింట్‌తో స్పెషల్ షోలు ప్లాన్ చేశారు. మహేష్ మాస్ డైలాగ్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో థియేటర్లు మళ్లీ హోరెత్తనున్నాయి. మరి రీరిలీజ్లో ఈ సినిమా బాహుబలి, ఖలేజా రికార్డులు బద్దలు కొడుతుందో లేదో చూడాలి.

