Cold Weather

Cold Weather: తెలంగాణలో భారీగా పెరిగిన చలి.. వారం రోజుల పాటు ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త

Cold Weather: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే అనేక జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు (నవంబర్ 11 – 19)

వాతావరణ శాఖ అంచనా ప్రకారం, నవంబర్ 11 నుంచి 19 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోనున్నాయి.

పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల నుంచి 12 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా.

ఇది కూడా చదవండి: Ande Sri: ప్రముఖ రచయిత అందెశ్రీ (64) కన్నుమూత

ఆదిలాబాద్ కలెక్టర్ హెచ్చరికలు

తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రత్యేకంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ ప్రాంతానికి హెచ్చరికలు జారీ చేయడంతో, జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రజలను అప్రమత్తం చేశారు.

చలి తీవ్రత నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. చిన్న పిల్లలు, వృద్ధులు మరియు గర్భిణీ మహిళలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు.

చలి తీవ్రత దృష్ట్యా ప్రజలు తగినన్ని ఉన్ని దుస్తులు ధరించి, తమ ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *