Murder case:

Murder case: దుండిగ‌ల్ మ‌హిళ హ‌త్య కేసులో వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు

Murder case: మేడ్చ‌ల్ -మ‌ల్కాజిగిరి జిల్లా దుండిగ‌ల్ మ‌హిళ హ‌త్య కేసులో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆమె నివాసం ఉండే ఇంటి య‌జ‌మానితో వివాహేత‌ర బంధం కార‌ణంగానే ఆమె ప్రియుడి బంధువు ఆమెను హ‌త‌మార్చిన‌ట్టు తేలింది. ఆమె ఇంటిలోనే చిన్నారి కొడుకు ముందే ఆ మ‌హిళ గొంతు కోసి హ‌త‌మార్చ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఘ‌ట‌న అనంత‌రం ఈ రోజు నిందితుడు స్వ‌యంగా పోలీసుల‌కు లొంగిపోవ‌డం గ‌మ‌నార్హం.

Murder case: దుండిగ‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని గ్రీన్‌హిల్స్ కాల‌నీలో నివ‌సించే స్వాతి (21) అనే వివాహిత మ‌హిళకు ప‌దేండ్ల క్రిత‌మే వివాహం జ‌రిగింది. కుటుంబ గొడ‌వ‌ల‌తో ఆమె పెండ్ల‌యిన కొన్నాళ్ల నుంచే భ‌ర్త‌కు దూరంగా ఉంటున్న‌ది. త‌న కొడుకుతో క‌లిసి ఆమె దుండిగ‌ల్‌లో వేరుగా నివ‌సిస్తున్న‌ది. ఉపాధి కోసం చిన్న‌పాటి ప‌నులు చేసుకుంటూ జీవ‌నం గ‌డుపుతున్న‌ది.

Murder case: ఆ మ‌హిళ నివాసం ఉండే ఇంటి య‌జ‌మాని అయిన‌ కిష‌న్‌తో ఆ మ‌హిళ స్వాతి వివాహేత‌ర బంధం పెట్టుకున్న‌ది. ఈ విష‌యంలో ఆ ఇంటి య‌జ‌మాని కుటుంబ స‌భ్యుల‌తో ప‌లుమార్లు గొడ‌వ‌లు జ‌రిగాయి. ఈ కార‌ణంగానే రాజేశ్ అనే వ్య‌క్తి స్వ‌యంగా ఆమె ఇంటిలోకి వెళ్లి ఆమె కొడుకు ఎదుటే గొంతుకోసి హ‌త్య చేశాడు.

Murder case: ఆ త‌ర్వాత త‌న మామ‌తో వివాహేత‌ర బంధం పెట్టుకున్నందునే తాను స్వాతిని హ‌త్య చేసిన‌ట్టు నిందితుడు రాజేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. త‌న కుటుంబంలో జ‌రుగుతున్న గొడ‌వ‌ల‌కు స్వాతి కార‌ణ‌మ‌ని భావించి, త‌న అల్లుడు రాజేశ్‌తో ఆ ఇంటి య‌జ‌మాని కిష‌న్ ఆమెను హ‌త్య చేయించిన‌ట్టు నిందితుడు పోలీసుల‌కు తెలిపిన‌ట్టు స‌మాచారం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *