Droupadi Murmu:

Droupadi Murmu: న‌వంబ‌ర్ 21న తిరుమ‌ల‌కు రాష్ట్రప‌తి ముర్ము

Droupadi Murmu: భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము న‌వంబ‌ర్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రెండు రోజులు ప‌ర్య‌టించ‌నున్నారు. న‌వంబ‌ర్ 20న ఆమె ఏపీలోని ఏపీలోని తిరుప‌తికి చేరుకుంటారు. తొలుత ఆమె తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటారు. అనంత‌రం అక్క‌డి నుంచి నేరుగా తిరుమ‌ల‌కు చేరుకుంటారు. మ‌రుస‌టి రోజైన న‌వంబ‌ర్ 21న ఆల‌య సంప్ర‌దాయాన్ని అనుస‌రించి ముందుగా శ్రీ వ‌రాహ‌స్వామి వారిని, ఆ త‌ర్వాత శ్రీవారిని ద‌ర్శించుకుంటారు.

Droupadi Murmu: ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తి ముర్ము ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) అధికారులు ఏర్పాట్ల‌కు సిద్ధ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే తిరుమ‌ల‌లోని ప‌ద్మావ‌తి గెస్ట్‌హౌస్ మీటింగ్ హాలులో ఉన్న‌తస్థాయి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. రాష్ట్ర‌ప‌తి రాక సంద‌ర్భంగా తిరుమ‌ల‌లో చేపట్టే ఏర్పాట్ల‌పై, ద‌ర్శ‌నాల‌పై ఈ సంద‌ర్భంగా చ‌ర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *