Prithviraj Sukumaran

Prithviraj Sukumaran: SSMB29 నుండి పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ రిలీజ్.. మాములుగా లేదుగా

Prithviraj Sukumaran: ఇండియాలో తో పాటు ప్రపంచ సినిమా ప్రియులు ఎదురుచూస్తున సినిమాలో ఒక్కటి మహేష్ బాబు రాజమౌళి సినిమా.  అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న SSMB29 చిత్రం నుంచి మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న పాత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పాత్ర చేస్తున్నారు.  అధికారికంగా విడుదల చేసిన ఈ లుక్‌లో, ‘కుంభ’ ఒక దుర్మార్గపు సూపర్‌విలన్  అని రాసి ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌ను షేర్ చేస్తూ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ రాజమౌళి, పృథ్వీరాజ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణ స‌ర్కార్‌కు మ‌రో షాక్‌.. డిసెంబ‌ర్ 1 నుంచి ఆ ప‌నులు చేస్తామ‌ని బిల్డ‌ర్ల హెచ్చ‌రిక‌

“పృథ్వీతో మొదటి షాట్ చిత్రీకరించిన తర్వాత, నేను అతని వద్దకు వెళ్లి, మీరు నాకు తెలిసిన అత్యుత్తమ నటులలో ఒకరు అని చెప్పాను. ఈ దుష్ట, క్రూరమైన, శక్తివంతమైన విరోధి కుంభకు ప్రాణం పోయడం సృజనాత్మకంగా నాకు చాలా సంతృప్తికరంగా ఉంది. తన కుర్చీలో జారిపోయినందుకు (విశ్రాంతి తీసుకున్నందుకు) పృథ్వీకి ధన్యవాదాలు… అక్షరాలా!” అంటూ రాజమౌళి రాసుకొచ్చారు. దర్శకుడి ఈ వ్యాఖ్యలు పృథ్వీరాజ్ నటన స్థాయిని, కుంభ పాత్ర ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నాయి.

టైటిల్ లాంచ్ అప్‌డేట్

SSMB29 టైటిల్ లాంచ్ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లాంచ్‌ను నవంబర్ 15, 2025న గ్రాండ్‌గా, ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా నిర్వహించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.

మహేష్ బాబు మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య జరిగే పోరాటం తెరపై అద్భుతంగా ఉంటుందని అభిమానులు మరియు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *