12A Railway Colony: నటకిరీటి అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ’12A రైల్వే కాలనీ’ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ నుంచి ఫస్ట్ సింగిల్ ‘కన్నోదిలి కలనోదిలి’ విడుదలై ఆడియెన్స్ ఆకట్టుకుంటోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన స్వరాలు, లవ్ ఫీలింగ్‌ను అందంగా హైలైట్ చేస్తున్నాయి. ఈ పాటలో హేషమ్ అబ్దుల్ వహాబ్ వోకల్స్ ఒక మ్యాజిక్‌లా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. దేవ్ పవార్ అందించిన సాహిత్యం కూడా చాలా అద్భుతంగా కుదిరింది. ఈ పాటలో హీరో అల్లరి నరేష్, హీరోయిన్ డాక్టర్ కామాక్షి భాస్కర్ల మధ్య కెమిస్ట్రీ చాలా లవ్లీగా ఉండగా, విజువల్స్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి.
Also Read: Jatadhara: జటాధరకు ‘A’ సర్టిఫికెట్!
సినిమా వివరాలు:
నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో, ‘పోలిమేర’ సిరీస్‌తో పాపులర్ అయిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి షోరన్నర్‌గా వ్యవహరించారు. ఆయన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించడం విశేషం. ఇప్పటికే విడుదలైన టీజర్… ఎమోషన్స్, ప్రేమ, థ్రిల్ అంశాలతో కూడిన మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తుందనే అంచనాలను పెంచింది.
సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి వంటి పలువురు నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. సినిమాటోగ్రఫీని కుశేందర్ రమేష్ రెడ్డి నిర్వహించగా, దర్శకుడు నాని కాసరగడ్డ స్వయంగా ఎడిటింగ్ బాధ్యతలు కూడా చూసుకున్నారు. ఈ థ్రిల్లర్ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

