jubliee hills By elections 2025:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు ఎటువైపు మొగ్గు చూపుతాయి? ఎవరిని విజయం వరిస్తుంది? ముస్లిం మైనార్టీ ఓట్లు ఎవరి వైపు? సెటిలర్లు ఏ పార్టీకి మొగ్గు? ఏ డివిజన్లో ఏ పార్టీ ఆధిక్యత చాటుతుంది? అన్న అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే అన్ని పార్టీల ప్రచారం ఊపందుకున్నది. ఈ దశలో ప్రముఖ సెఫాలజిస్టు కేకే సర్వే ఫలితాలు సర్వత్రా ఉత్కంఠకు దారితీసింది.
jubliee hills By elections 2025:ప్రముఖ సెపాలజిస్టు కేకే సర్వేస్ సంస్థ తాజాగా వెల్లడించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సర్వే ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీకే గెలుపు అవకాశాలు ఉన్నట్టు తేలింది. ఏ డివిజన్లో ఎంత మేరకు తేడా ఉన్నదో, మూడు ప్రధాన పార్టీల ఓటింగ్ శాతం వివరాలను కేకే వెల్లడించారు. ఆరు డివిజన్లకు గాను రెండు డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యత చూపుతుండగా, మిగతా నాలుగు డివిజన్లలో బీఆర్ఎస్ భారీ ఆధిక్యతను రాబట్టుకుంటుందని తేల్చి చెప్పారు. అన్నింటిలోనూ బీజేపీ మూడో స్థానానికే పరిమితమైందని తేల్చారు. అది కూడా గతం కంటే సగం ఓటింగ్ శాతాన్ని ఆ పార్టీ కోల్పోతుందని చెప్పారు. మొత్తంగా బీఆర్ఎస్ 55.2 శాతం ఓట్లు సాధిస్తుందని, కాంగ్రెస్ 37.8 శాతం ఓటింగ్, బీజేపీ కేవలం 7 శాతం ఓటింగ్‌తో ఫలితాలు ఉంటాయని కేకే తన సర్వే ఫలితాలను ప్రకటించారు.
jubliee hills By elections 2025:2019, 2024లో జరిగిన ఏపీ ఎన్నికల్లో కేకే సర్వే సంస్థ నిర్వహించిన సర్వేల్లో ఫలితాలు దరిదాపుల్లోకి రావడంతో ఆ సంస్థపై కొంత విశ్వసనీయ ఏర్పడింది. 2019లో ఏపీలో వైసీపీ 150కి పైగా స్థానాలను కైవసం చేసుకుంటుందని ముందే అంచనా వేయగలిగారు. 2024లో కూటమికి అత్యధిక స్థానాలు దక్కుతాయని, అందులో జనసేన 100 శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తుందని అంచనా వేయగలిగారు. అయితే ఢిల్లీ, మహారాష్ట్ర సర్వే అంచనాలు తలకిందులు కావడం ఆయనకు కొంత మచ్చగానే చెప్పవచ్చు.
jubliee hills By elections 2025:తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై వేసిన కేకే అంచనా తలకిందులైతే ఆయన సంస్థ మసకబారే అవకాశం ఉన్నది. అయితే తాను ఒకటి, రెండు రోజుల్లో చేసిన సర్వే కాదని, నెల రోజులుగా విస్తృతస్థాయిలో చేసినట్టు కేకే వెల్లడించడం విశేషం. ఆయన చెప్పిందే నిజమైతే ఆయన సంస్థకు విశ్వసనీయత మరింత పెరుగుతుంది.
డివిజన్ల వారీగా కేకే సర్వే ఫలితాల శాతం ఇలా ఉన్నాయి
రహమత్‌నగర్ : బీఆర్ఎస్-63.2, కాంగ్రెస్-31.6, బీజేపీ 5.2
శ్రీనగర్ కాలనీ : బీఆర్ఎస్-61.9, కాంగ్రెస్-33.3, బీజేపీ 4.8
వెంగళరావు నగర్: బీఆర్ఎస్-46.1, కాంగ్రెస్-48.5, బీజేపీ 5.5
ఎర్రగడ్డ: బీఆర్ఎస్-61.6, కాంగ్రెస్-31.7, బీజేపీ 6.7
షేక్‌పేట : బీఆర్ఎస్-60.1, కాంగ్రెస్-33.6, బీజేపీ 6.9
యూసుఫ్‌గూడ : బీఆర్ఎస్-47, కాంగ్రెస్-45.5, బీజేపీ 7.4

