Phone tapping: ఫోన్ ట్యాపింగ్.. నోటీసులపై స్పందించిన చిరుమర్తి

Phone tapping: ఫోన్ టైపింగ్ కేసులో తనకొచ్చిన నోటీసులపై స్పందించారు బీఆర్ఎస్ నేత నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు అవుతానని చెప్పారు. గురువారం ఉదయం నార్కట్‌పల్లిలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తప్పకుండా విచారణను ఎదుర్కొంటా.. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా అని అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చారని తెలిపారు.

నోటీసులపై న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తున్నందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ఇరికిస్తున్నారని చెప్పారు.జిల్లాలో పనిచేసిన పోలీసులతో మాట్లాడి ఉండొచ్చు.. పోలీసు అధికారులు పోస్టింగుల కోసం, కార్యకర్తల అవసరాల కోసం తాను మాట్లాడటం సహజమే అని తెలిపారు. కాగా, ఇవాళే విచారణ ఉండటంతో నార్కట్‌పల్లి నుంచి చిరుమర్తి లింగయ్య హైదరాబాద్‌కు బయల్దేరారు. కాసేపట్లో జూబ్లీహిల్స్‌లోని పోలీస్ స్టేషన్‌లో విచారణ ప్రారంభం కానుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *