Mohammed Siraj: ఆగస్టు 2025 నెలకు గాను ఐసీసీ (ICC) ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను నామినేట్ చేసింది. ఈ అవార్డు రేసులో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో సిరాజ్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్‌లో 9 వికెట్లు తీసి భారత్‌ను విజయం సాధించేలా చేసి సిరీస్‌ను సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాట్ హెన్రీ (న్యూజిలాండ్) జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో 16 వికెట్లు పడగొట్టి తన జట్టును 2-0తో గెలిపించాడు. జేడెన్ సీల్స్ (వెస్టిండీస్) పాకిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అత్యధిక వికెట్లు (10) తీసి వెస్టిండీస్‌కు సిరీస్ విజయాన్ని అందించడంలో కీలకమయ్యాడు.
మహిళల విభాగంలో పాకిస్తాన్‌కు చెందిన మునీబా అలీ, ఐర్లాండ్‌కు చెందిన ఓర్లా ప్రెండర్‌గాస్ట్, నెదర్లాండ్స్‌కు చెందిన ఐరిస్ జ్విల్లింగ్ నామినేట్ అయ్యారు. కాగా ఈ ఏడాది ఆగష్టు నెలలో సిరాజ్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా.. ఇంగ్లండ్‌తో జూలై 31- ఆగష్టు 4 వరకు ఓవల్ మైదానంలో జరిగిన ఐదో టెస్టులో… ఈ హైదరాబాదీ పేసర్ చివరగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఐదు టెస్టుల సిరీస్‌ను సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆఖరి రోజు.. చివరి సెషన్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
ఇది కూడా చదవండి: Bigg Boss 9 Telugu: గుండు అంకుల్.. చూసుకుని మాట్లాడాలి బ్రదర్.. హరీష్, ఇమ్మానుయేల్ మధ్య రచ్చ
ఇంగ్లండ్ చేతిలో ఆరు వికెట్లు ఉండి విజయానికి కేవలం 73 పరుగుల దూరంలో ఉన్న వేళ ఈ రైటార్మ్ పేసర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలీ (14), ఓలీ పోప్ (27), జేమీ స్మిత్ (2), జేమీ ఓవర్టన్ (9) రూపంలో కీలక వికెట్లు కూల్చి సిరాజ్ మియా.. ఆఖరి వికెట్‌గా గస్ అట్కిన్సన్ (17)ను వెనక్కి పంపాడు.
