Fire Accident

Fire Accident: కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: హైదరాబాద్‌లో మరోసారి అగ్నిప్రమాదం సంచలనం రేపింది. సోమవారం తెల్లవారుజామున కుషాయిగూడ ప్రాంతంలోని ఓ స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు భారీ ఎత్తున ఎగసిపడటంతో పరిసర ప్రాంతమంతా పొగమంచు కమ్మేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే గోదాంలో పెద్దఎత్తున స్క్రాప్ పదార్థాలు ఉండటంతో మంటలు మరింతగా వ్యాపించే అవకాశం ఉన్నట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Crime News: భర్త కొత్త నాటకం.. మెట్ల మీద నుంచి పడిపోయిన భార్య.. చూస్తే మొత్తం బోకాలే

సురక్షితంగా ఉండేలా చుట్టుపక్కల ట్రాఫిక్‌ను పోలీసులు నిలిపివేశారు. అదనంగా మంటలను అదుపులోకి తీసుకొచ్చే పనిలో నాలుగు ఫైరింజన్లు శ్రమిస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.

అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *