br naidu

BR Naidu: టీటీడీ చైర్మన్ గా బి.ఆర్.నాయుడు ప్రమాణ స్వీకారం

BR Naidu: టిటిడి బోర్డు మెంబర్‌ గా ప్రశాంతిరెడ్డి ప్రమాణస్వీకారం – హాజరైన ఎంపీ వేమిరెడ్డి, ముఖ్య నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌ గా నియమితులైన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. టిటిడి ఛైర్మన్‌ బి.ఆర్‌ నాయుడు ,ఇతర సభ్యులతో కలిసి శ్రీవారి ఆలయంలో ఆమె బోర్డు మెంబర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తో పాటు తనయులు అర్జున్‌రెడ్డి, నీలిమారెడ్డి పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Agricultural Drone: విస్తరిస్తున్న డ్రోన్‌ సేద్యం.. కూలీల కొరతతో వ్యవసాయంలో కొత్తపుంతలు
అనంతరం వేమిరెడ్డి దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అఖండ దీపం వద్ద టెంకాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తిరుమలలో ఎక్కడా సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ అవకాశం ఇచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Telangana: గ్రూప్ 1 మెయిన్స్‌పై ర‌గులుతున్న నిరుద్యోగులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *