Vijayawada: భళా ఏపీ పోలీస్.. రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం సీజ్

Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం అక్రమ భళా ఏపీ పోలీస్.. రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం సీజ్ అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. తాజాగా విజయవాడ–చెన్నై జాతీయ రహదారిపై భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ముఠా గుట్టును రెడ్ శాండర్స్ యాంటీ-స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ బృందం భేదించింది.

ప్రకాశం జిల్లా కె. బిట్రగుంట గ్రామం వద్ద టాస్క్‌ఫోర్స్ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న లారీని ఆపి పరిశీలించగా, అందులో 83 ఎర్రచందనం దుంగలు దొరికాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా వేశారు

లారీతో పాటు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పర్తి చేసిన టాస్క్‌ఫోర్స్ బృందాన్ని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ప్రత్యేకంగా అభినందించారు. స్మగ్లర్లను చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని ఆయన ప్రశంసించారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *