Sudarshan Reddy

Sudarshen Reddy: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి

Sudarshen Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికలపై నెలకొన్న అనిశ్చితి తొలిగింది. ప్రతిపక్ష ఇండియా కూటమి తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి పేరును ఖరారు చేసింది. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

సుదర్శన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామానికి చెందినవారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. సుప్రీంకోర్టులో నాలుగున్నరేళ్ల పాటు న్యాయమూర్తిగా సేవలందించిన తర్వాత రిటైర్ అయ్యారు. అనంతరం గోవా లోకాయుక్త చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

ఇది కూడా చదవండి:FASTag Annual Passes: 4 రోజుల్లో ₹150 కోట్లు వసూలు చేసిన NHAI..

ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్షాలను ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు ఇవ్వాలని కోరినా, ఇండియా కూటమి వేరే దారిని ఎంచుకుంది. స్వతంత్రంగా తమ అభ్యర్థిని పోటీకి దింపి రాజకీయ రంగంలో చర్చనీయాంశమైంది.

మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేసిన సీపీ రాధాకృష్ణన్‌ను ఎన్డీఏ ఇప్పటికే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ప్రతిపక్షం తరఫున జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి పోటీలో నిలవడంతో రాబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

గత నెలలో అనారోగ్య కారణాల వల్ల ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ రాజీనామా చేసిన తరువాత ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 9న ఓటింగ్ జరగనుండగా, నామినేషన్ల దాఖలు చివరి తేదీ ఆగస్టు 21గా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *