Cm chandrababu: సీపీ రాధాకృష్ణన్ అభ్యర్థిత్వానికి టీడీపీ మద్దతు:

Cm chandrababu: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పేరును ప్రకటించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. రాధాకృష్ణన్ అభ్యర్థిత్వానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో స్పందించిన చంద్రబాబు, “సీపీ రాధాకృష్ణన్ అనుభవజ్ఞుడైన రాజనీతిజ్ఞుడు, గౌరవనీయ నాయకుడు. దేశానికి ఆయన సుదీర్ఘకాలం పాటు విశిష్టమైన సేవలు అందించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం” అని పేర్కొన్నారు.

అలాగే, ఎన్డీఏ కూటమి భాగస్వామిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణన్ విజయం సాధించేందుకు టీడీపీ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని హామీ ఇచ్చారు. రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం సరైన నిర్ణయం అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *