Raja Singh: పాత కార్యకర్తల పరిస్థితి ఏం అవుతుంది?

Raja Singh: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశమే లేదని స్పష్టం చేశారు.

“ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో నా మనిషే అన్నట్లుగా వ్యవహరిస్తే, ఎన్నో ఏళ్లుగా కష్టపడి, ప్రాణం పెట్టి పార్టీ కోసం పనిచేసిన పాత కార్యకర్తల పరిస్థితి ఏం అవుతుంది?” అని ఆయన ప్రశ్నించారు.

బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణ మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదని, వారు ఇతర రాష్ట్రాలపై దృష్టి సారిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని కొంతమంది పెద్దల మాటలకే అధిష్టానం లోబడి పనిచేస్తుందని, అలాంటి నిర్ణయాల వల్ల తెలంగాణ బీజేపీకి తీవ్ర నష్టం జరుగుతోందని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.

“వారి పేర్లు ఇప్పుడు చెప్పలేను, కానీ వారి కారణంగానే పార్టీకి ఇక్కడ నష్టాలు ఎక్కువ అవుతున్నాయి” అని రాజాసింగ్ స్పష్టం చేశారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *