Btech Ravi: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయంపై బీటెక్ రవి స్పందన

Btech Ravi: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఊహించిన దానికంటే ఎక్కువ మెజార్టీ సాధించిందని, రీ పోలింగ్‌లో కూడా ప్రజలు కూటమి అభ్యర్థినే గెలిపించారని ఆ పార్టీ పులివెందుల ఇన్‌చార్జ్ బీటెక్ రవి అన్నారు. గత ఐదేళ్లలో పులివెందుల వైసీపీ కార్యకర్తలను ముఖ్యమంత్రి జగన్ విస్మరించారని, అందువల్లే వారు అసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

రీ పోలింగ్‌ను కోరింది వైసీపీ నేత అవినాష్ రెడ్డేనని, కానీ ఆ రీ పోలింగ్‌లో కూడా ప్రజలు టీడీపీకే పట్టం కట్టారని తెలిపారు. జగన్ ప్రసంగాలు గంగమ్మ జాతర, రప్పా రప్పా స్థాయిలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. వైసీపీ లోపలే జగన్ అహంకారాన్ని తగ్గించాలనుకునే నాయకులు ఉన్నారని, ఎన్నికల్లో సహకరిస్తామని కొందరు వైసీపీ నేతలే తనకు చెప్పారని వెల్లడించారు.

వైసీపీ కార్యకర్తలు తమ అసంతృప్తి తనతో పంచుకున్నారని, ఐదేళ్లు పని చేయించుకుని పావలా కూడా ఇవ్వలేదని వారు విమర్శించారని తెలిపారు. జగన్ పై వైసీపీ కేడర్‌కే కసి ఉందని, ఇప్పుడు తాను కూడా అది నమ్ముతున్నానని బీటెక్ రవి అన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *