Delhi: కేంద్ర కేబినెట్ ఈ రోజు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమెరికా విధించిన 50% సుంకాలపై చర్చించడంతో పాటు, దేశీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఐదు ప్రధాన అంశాలపై ఆమోదం తెలిపింది.
ప్రధాన నిర్ణయాలు:
పీఎం ఉజ్వల యోజనను కొనసాగించాలని నిర్ణయం.
అసోం, త్రిపుర రాష్ట్రాలకు రూ.7,250 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ; ఇందులో రూ.4,250 కోట్లు గ్రాంట్‌గా.
సాంకేతిక విద్య కోసం రూ.4,200 కోట్లు కేటాయింపు – ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల అప్‌గ్రేడ్‌కు ఉపయోగం.
మరక్కనం-పుదుచ్చేరి 4-లేన్ హైవే నిర్మాణానికి ఆమోదం; రూ.2,157 కోట్లు కేటాయింపు.
ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు పరిహారంగా రూ.30,000 కోట్లు మంజూరు.
అమెరికా సుంకాలకు ప్రతిస్పందన:
అమెరికా 50% సుంకాలకు ప్రతిగా, భారత్ కీలక చర్యలు చేపట్టింది. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్లు, ముఖ్యంగా క్షిపణుల డీల్‌ను నిలిపివేసింది. అలాగే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు.
