Hyderabad News:హైదరాబాద్ మహానగరానికి రోప్‌వే సొబగులు అద్దేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ప్రపంచ స్థాయి నగరంగా దినదినాభివృద్ధి చెందుతున్న భాగ్యనగరానికి నిత్యం పర్యాటకుల తాకిడి పెరుగుతున్నది. చారిత్రక ప్రాంతాలతోపాటు, కమర్షియల్ సొగసులను ఆస్వాదించడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నది. ఈ రద్దీని తగ్గించడంలోనూ రోప్‌వే సాయపడుతన్నదని హెచ్ఎండీఏ అధికారులు యోచిస్తున్నారు.
Hyderabad News:ఈ నేపథ్యంలో ఆకాశమార్గాల వైపు అడుగులు వేస్తున్నారు. తొలుత గోల్కొండ నుంచి కుతుబ్‌షాహీ టూంబ్స్ ప్రాంతాల మధ్య రోప్‌వే సాధ్యాసాధ్యాలపై హెచ్ఎండీఏ అధికారులు చర్చిస్తున్నారు. పర్యాటక, అటవీశాఖలతో సమన్వయం చేసుకొని కార్యాచరణను సిద్ధం చేస్తున్నది. రోప్‌వేలు అందుబాటులోకి వస్తే మాత్రం హైదరాబాద్ నగరానికి పర్యాటకుల సంఖ్య మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు.
Hyderabad News:గోల్కొండ సందర్శనకు వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు రోప్‌వే దోహద పడుతుందని, కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను కూడా విధిగా పర్యాటకులు సందర్శించే అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు. గోల్కొండ- కుతుబ్‌షాహీ టూంబ్స్ మధ్య రోప్‌వే ఏర్పాటు చేస్తే, ఇదే నగరంలో తొలిది అవుతుంది. ఇప్పటికే ప్రాథమిక చర్చలు పూర్తవగా, కార్యరూపం దాల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

