Mahavatar Narsimha

Mahavatar Narsimha: మహావతార్ నరసింహా: భారతీయ సినిమాకు కొత్త ఒరవడి!

Mahavatar Narsimha: మహావతార్ నరసింహా, హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ యానిమేటెడ్ చిత్రం తాజాగా విడుదలయ్యి ఎంతగానో ఆకట్టుకుంటుంది. విష్ణు పురాణం, నరసింహ పురాణం నుండి స్ఫూర్తి పొందిన ఈ చిత్రం, ప్రహ్లాద భక్తి, హిరణ్యకశిపుడి దురహంకారం మధ్య జరిగే ఆధ్యాత్మిక సంఘర్షణను చిత్రిస్తుంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, అద్వితీయ విజువల్స్, సాంప్రదాయ సంగీతం, శక్తిమంతమైన సంభాషణలతో ప్రేక్షకులను అలరిస్తోంది. నరసింహ అవతారం ఆవిర్భావ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఐదు భాషల్లో విడుదలైన ఈ చిత్రం, భారతీయ యానిమేషన్‌ ని మరో మెట్టు ఎక్కించింది. సోషల్ మీడియాలో కూడా ఈ చిత్రం హైప్ సృష్టిస్తోంది. 2025 నుండి 2037 వరకు విష్ణు దశావతారాలను చాటే ఈ ఏడు చిత్రాల సిరీస్, భారతీయ సంస్కృతిని ప్రపంచ వేదికపై ఆవిష్కరించనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *