Regina Cassandra: హాట్ బ్యూటీ రెజీనా కసాండ్రా సినీ రంగంలో తన 20 ఏళ్ల ప్రయాణంపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పరిశ్రమలో నటన కంటే పీఆర్, సోషల్ మీడియా క్రేజ్‌పైనే అవకాశాలు ఆధారపడుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కష్టపడి ఎదిగిన ఆమె, మొదట్లో సోషల్ మీడియాను మాయగా భావించినా, ఇప్పుడు దాని ప్రాముఖ్యతను గుర్తించారు. 2015-16లో కెరీర్ గ్రాఫ్ దిగజారిన సమయంలో సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్న రెజీనా, 2018లో మళ్లీ అవకాశాలతో బలంగా తిరిగొచ్చారు. తెలుగు రాని సమయంలో డైలాగులు కంఠస్థం చేసి నటించడం తనకు సవాల్‌గా ఉండేదని, ఇప్పుడు తెలుగులో సౌకర్యంగా మాట్లాడగలనని చెప్పారు. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న రెజీనా, సినీ రంగంలో స్త్రీ పాత్రలకు మరింత గౌరవం, లోతైన చిత్రణ అవసరమని పేర్కొన్నారు.
