Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సోదరుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మంత్రి పదవిపై స్పందించారు. ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ విషయంలో తుది నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని స్పష్టం చేశారు. తమవైపు నుంచి ఇంకా ఈ అంశంపై చర్చ జరగలేదని, తాను స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఉంటే తీసుకుంటానని చెప్పారు.
రాజకీయాల్లో ఇలాంటి సందిగ్ధ పరిస్థితులు, సమస్యలు సహజమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. గతంలో నాగబాబుకు మంత్రి పదవి ఖాయమని, అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే, ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కూడా నాగబాబుకు మంత్రి పదవి విషయమై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు.
