KTR: జాతీయ భాష అనవసరం – హిందీని రుద్దొద్దు

KTR: జాతీయ భాషపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్‌గా మారాయి. జైపూర్‌లో నిర్వహించిన టాక్ జర్నలిజం 2025 కార్యక్రమంలో విద్యార్థులతో జరిగిన ఓ చర్చలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఓ విద్యార్థి అడిగిన జాతీయ భాషపై ప్రశ్నకు స్పందించిన కేటీఆర్, “హిందీ జాతీయ భాష కాదని స్పష్టం చేశారు. భారత్‌ భిన్న సంస్కృతుల దేశం. ఇక్కడ 20 అధికారిక భాషలు, 300కి పైగా అనధికారిక భాషలు ఉన్నాయి” అని తెలిపారు.

“భాష అనేది భావాలను వ్యక్తీకరించేందుకు ఉపయోగించే ఒక సాధనం మాత్రమే. దాన్ని ఆధిపత్యానికి సూచకంగా ఉపయోగించడం సరైంది కాదు. హిందీ మాట్లాడేవాళ్ల సంఖ్య ఎక్కువ అని, మాపై హిందీని రుద్దటం అన్యాయం” అని అన్నారు.

ఇంకా మాట్లాడుతూ, “తెలుగు భాషను జాతీయ భాషగా చేయాలని మేము ప్రతిపాదిస్తే, ఇతర రాష్ట్రాల ప్రజలు ఒప్పుకుంటారా? ఎలాగైతే మేము మా భాషను ఇతరులపై రుద్దలేమో, అలాగే హిందీని మాపై రుద్దడాన్ని మేము అంగీకరించం” అని ఆయన వ్యాఖ్యానించారు.

“దేశంలో అత్యధికంగా హిందీ మాట్లాడుతారనే నెపంతో దాన్ని విధించడం తగదు. ఎవరైనా హిందీ నేర్చుకోవాలనుకుంటే అది వారి ఇష్టం, కానీ బలవంతంగా అది తగదు” అని స్పష్టం చేశారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు చేశారు. “హిందీ అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించి, తెలుగు, బెంగాలీ వంటి భాషలకు నిధులు కేటాయించకపోవడం ఎందుకు?” అని ప్రశ్నించారు.

కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. భాషపై సమానత్వం, ఆత్మగౌరవం గురించి మరోసారి దేశవ్యాప్తంగా చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *