Vishwambhara

Vishwambhara: ఫాంటసీ అడ్వెంచర్‌లో మరో సంచలనం కానున్న మెగాస్టార్ విశ్వంభర!

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా ఫాంటసీ జానర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది. జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి లాంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత చిరు మరోసారి ఫాంటసీ ప్రపంచంలో అడుగుపెడుతున్నారు. దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని ఏ.ఎన్.ఆర్ కీలుగుర్రం నుంచి స్ఫూర్తి పొంది రూపొందిస్తున్నారు. హీరోయిన్ కోసం హీరో 14 లోకాలను దాటి సత్యలోకానికి ప్రయాణించే కథాంశం అభిమానులను ఆకట్టుకుంటోంది.

Also Read: Akshay Kumar: హ్యాట్సాఫ్ అక్షయ్ కుమార్ .. 650 మంది స్టంట్‌ మ్యాన్‌లకు ఇన్సూరెన్స్ పాల‌సీ

అద్భుతమైన విజువల్స్, గ్రిప్పింగ్ కథనంతో ఈ సినిమా తెలుగు సినిమా సత్తాను మరోసారి చాటనుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది. చిరంజీవి భీమవరం దొరబాబు పాత్రలో కనిపించనున్నారని, ఈ సినిమా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అనుభవాన్ని అందిస్తుందని టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *