Kota Srinivasa Rao: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట శ్రీనివాసరావు (83) ఇక లేరు. గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కోట గారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంతాపం ప్రకటించారు.
విభిన్న పాత్రలను పోషించి, ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్న విలక్షణ వెండితెర నటుడు కోట శ్రీనివాసరావు అని కేసీఆర్ అన్నారు.
వారి మరణంతో సినీమా రంగం ఒక… pic.twitter.com/L24VAxFeFc
— BRS Party (@BRSparty) July 13, 2025
వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు గారి మరణం విచారకరం. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళా సేవ, ఆయన పోషించిన పాత్రలు చిరస్మరణీయం. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన పోషించిన ఎన్నో మధురమైన… pic.twitter.com/4C6UL29KPR
— N Chandrababu Naidu (@ncbn) July 13, 2025
మహ నటులు
శ్రీ “కోట” శ్రీనివాసరావు గారు🙏
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి కోరుకొంటూ
ఓం శాంతి🙏🙏 pic.twitter.com/IKNuvG0bWL— SKN (Sreenivasa Kumar) (@SKNonline) July 13, 2025
ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు గారి మృతి విచారకరం. విలక్షణమైన పాత్రల్లో నటించి, మెప్పించిన ఆయనను పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులు వరించాయి. కోటా గారి మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నివాళులు. pic.twitter.com/FjQsioIsO3
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 13, 2025
ఏ పాత్ర కైనా ప్రాణం పొసే గొప్ప నటుడు,
నవరసాలని అద్భుతం గా పలికించె కోట శ్రీనివాసరావు గారు లేరు అనేది నమ్మలేని నిజం 🙏🙏
మీ గుర్తు లు గా మీరు మాకు ఇచ్చి వెళ్లిన ఎన్నో గొప్ప పాత్ర ల్లో మిమ్మల్ని స్మరించుకుంటాం 🙏🙏🙏🙏
ఓం శాంతి 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/Trs3D6Kupu— Anil Ravipudi (@AnilRavipudi) July 13, 2025
లెజెండరీ యాక్టర్ , బహుముఖ ప్రజ్ఞా శాలి
శ్రీ కోట శ్రీనివాస రావు గారు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది.‘ప్రాణం ఖరీదు’ చిత్రం తో ఆయన నేను ఒకే సారి సినిమా కెరీర్ ప్రారంభించాము. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన…
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 13, 2025
