Galla Ramachandra Rao: గళ్ళా రామచంద్రరావు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు వరకూ రాష్ట్ర రాజకీయాలకు పెద్దగా తెలియని పేరు ఇది. అయితే, ఎన్నికలకు కేవలం నెల రోజుల ముందు గుంటూరు వెస్ట్ టీడీపీ అభ్యర్థిగా రామచంద్రరావు భార్య గళ్ళా మాధవిని బరిలో దించింది టీడీపీ అధిష్ఠానం. అయితే, తన ప్రత్యర్థి, వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి విడదల రజినీని మట్టి కరిపించి, ఆ నియోజకవర్గంలోనే కనివినీ ఎరుగని విధంగా 51,150 ఓట్ల మెజారిటీతో గల్లా మాధవి గెలిచారు. ఇక్కడ నుంచే అసలు కథ మొదలైంది. రాజకీయాల్లోకి రాకముందు భ్రమరా రియల్ ఎస్టేట్, వికాస్ హాస్పిటల్స్ నిర్వహించారు గళ్ళా రామచంద్రరావు. ఈ సంస్థ ద్వారా వైసీపీ అనుకూల మీడియాకు కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చేవారు. దీంతో అప్పుడు రామచంద్రరావు వీరుడు, సూరుడు అన్న వైసీపీ, దాని అనుకూల మీడియా, మాధవి ఎమ్మెల్యే అయిన తర్వాత రామచంద్రరావు మీద విషం కక్కడం స్టార్ట్ చేశాయి.
గళ్ళా రామచంద్రరావు రాజకీయాల్లోకి రాకముందు వరకూ రెండు తెలుగు రాష్ట్రాలలో భ్రమరా రియల్ ఎస్టేట్ పేరుతో వందల ప్రాజెక్ట్‌లు పూర్తి చేశారు. అప్పటి వరకూ ఒక్క చిన్న మచ్చ కూడా ఆ సంస్థపై కానీ, గళ్ళా రామచంద్రరావుపై కానీ లేదు. కేవలం ఎన్నికల్లో మాధవి భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత మాత్రమే గళ్ళా రామచంద్రరావును వైసీపీ అనుకూల మీడియా పనిగట్టుకుని విలన్‌ను చేసే ప్రయత్నం స్టార్ట్ చేసింది. పిడుగురాళ్ల సమీపంలో వేసిన భ్రమరా వెంచర్‌పై వెంకట్రావు అనే వ్యక్తిని అడ్డం పెట్టుకొని విషం కక్కించింది వైసీపీ. అలాగే, ఇప్పుడు బాపట్ల తీర ప్రాంతంలో భ్రమరా అలోహ పేరుతో స్టార్ట్ చేసిన బీచ్ రిసార్ట్స్ విషయంలోనూ అలాగే విషం కక్కుతోంది.
Also Read: Mega PTM 2.0 Lokesh: జగన్ బైజూస్ కాదు కావాల్సింది.. లోకేష్ మెగా పీటీఎం
Galla Ramachandra Rao: బాపట్ల రూరల్ అడవి గ్రామంలో బూర్ల వెంకట్రావు అనే వ్యక్తికి తీర ప్రాంతంలో సుమారు 10 ఎకరాల రిజిస్టర్డ్ ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ ఆనుకొని ఈపురుపాలెం స్టేట్ కట్ కాలువను నీటిపారుదల శాఖ అధికారులు తవ్వడం జరిగింది. వరదల సమయంలో ఈ ప్రాంతం కింద ఉన్న వేలాది మంది రైతుల ప్రయోజనం కోసం ఈ కాలువ తవ్వడం జరిగింది. అయితే, ఇదే కాలువ నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళుతూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, వెంకట్రావుకు సంబంధించిన భూమి, ఈ కాలువ రెండూ సముద్రాన్ని ఆనుకొని ఉండడంతో సునామీ టైంలో కాలువ డైమెన్షన్ మారింది. దీనిపై మత్స్యకారులు, వెంకట్రావు మధ్య వివాదం నడుస్తోంది. ఈ సమస్యకు, గళ్ళా రామచంద్రరావుకు ఎలాంటి సంబంధం లేదు. కానీ, వైసీపీ నాయకులు తమ రాజకీయ ప్రయోజనం కోసం ఈ గొడవలోకి రామచంద్రరావును లాగారు.
దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఒకటి గళ్ళా రామచంద్రరావు టీడీపీ ఎమ్మెల్యే భర్త అవ్వడం, మరొకటి సింగయ్య యాక్సిడెంట్‌ను పక్కదారి పట్టించడానికి వేసిన స్కెచ్. రామచంద్రరావు ఆర్థికంగా బలపడితే మరోసారి తమకు బంగపాటు తప్పదనే భయంతో తన వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీయాలని చూస్తోంది వైసీపీ. చూడాలి, వైసీపీ రాజకీయ భవిష్యత్తులో ఇంకా ఎన్ని రంగులు మారుతుందో…?
