Lokesh Bags & Schools

Lokesh Bags & Schools: లోకేష్‌ సక్సెస్‌ని చూసి పడి ఏడ్చే పరిస్థితికొచ్చారా?

Lokesh Bags & Schools: ఒక్కసారి మా స్కూల్‌కి రండి. లోకేష్‌ సార్‌ మిమ్మల్ని చూడాలని ఉంది. నాణ్యమైన బ్యాగులిచ్చారు. పుస్తకాల మోత తగ్గించారు. సన్నబియ్యంతో రోజుకో మెనూతో రుచికరమైన భోజనం పెడుతున్నారు. పాఠశాలల్లో రాజీకీయ రంగులు తొలగించి, మహనీయుల స్ఫూర్తిని తీసుకొచ్చారు. తరగతి గదుల్ని బాగు చేశారు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువులు చెప్పిస్తున్నారు. మాకు ఇన్ని వసతులు ఇచ్చిన మిమ్మల్సి ఒక్కసారి చూడాలని ఉంది. మా స్కూలుకి రండి. అంటూ మంత్రి లోకేష్‌తో సహా సీఎం, డిప్యూటీ సీఎంల పేర్లు పేర్కొంటూ ఉత్తరాలు రాశారు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని వెదుళ్లపల్లి జెడ్పీ హైస్కూల్‌లోని ఆరవ తరగతి విద్యార్థులు.

ఇక బడిపిల్లల బ్యాగులపై బురదజల్లే ప్రయత్నం చేసిన ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి.. అదే స్కూలుకు వెళ్లిన మహాన్యూస్‌ ద్వారా బుద్ధి చెప్పారు అక్కడి స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు. బ్యాగులపై చేస్తున్న రాద్ధాంతమంతా ఫేక్‌ ప్రచారమేనని, బ్యాగులు అత్యంత క్వాలిటీతో ఉన్నాయని, క్వాలిటీ విషయంలో వారెంటీ కార్డులు సైతం ఇస్తున్నారనీ, ఎక్కడైనా ఒకట్రెండు బ్యాగులు చిరిగితే.. వాటిని ఫ్రీగా రిపేరు చేయించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందన్న విషయాలను మహాన్యూస్‌ ప్రజల ముందు ఉంచింది. ఇక వైసీపీ చేస్తున్న ఫేక్‌ ప్రచారాలపై పరిశీలించి, పరిశోధించి పలు జాతీయ మీడియా చానళ్లు సైతం కథనాలు ప్రసారం చేయడంతో.. లోకేష్‌ టార్గెట్‌గా బురదజల్లాలన్న వైసీపీ ప్రయత్నాలు పటా పంచలు అయ్యాయి.

ఇక నెల్లూరు నగరంలో వెంకటగిరి రాజా వారి మున్సిపల్ కార్పోరేషన్‌ హైస్కూల్‌ను పురపాలక శాఖ మంత్రి నారాయణతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు మంత్రి నారా లోకేష్‌. ఎంతోమంది ప్రముఖులు చదువుకున్న వీఆర్ హైస్కూల్ గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురై మూతపడింది. ఈ పాఠశాలలోనే చదువుకున్న మంత్రి నారాయణ చొరవ తీసుకుని రూ.15 కోట్ల వ్యయంతో పాఠశాలను ఆధునీకరించారు. వీఆర్‌ స్కూల్‌లో ఉన్న వసతులు చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ప్రయివేటులో చూసుకున్నా ఏపీలోనే ఈ తరహా పాఠశాల ఎక్కడా లేదన్న విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. రాబోయే అయిదేళ్లలో విఆర్ హైస్కూలు తరహాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 నియోజకవర్గాల్లో లీప్ మోడల్ స్కూళ్లను అభివృద్ధిచేసేందుకు సంకల్పించారు మంత్రి నారా లోకేష్‌. ఇలా పీ-4 స్ఫూర్తితో అనేక ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించి, వసతులు, అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తూ.. వినూత్న పంథాలో విజయవంతం అవున్న లోకేష్‌ విమర్శకుల మన్ననలు అందుకుంటున్నారు.

Also Read: Nara Lokesh: వైసీపీ నాయకులకు మహిళలంటే ఇంత ద్వేషభావమా?

ALSO READ  Pawan Kalyan: అభివృద్ధిపై మీ అంకితభావం.. భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలుస్తుంది

Lokesh Bags & Schools: ఇక వీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ ప్రారంభించిన సందర్భంగా లోకేష్ మరో మంచి పని కూడా చేశారు. “సారూ.. ఈ స్కూల్‌లో మాకూ చదువు చెప్తారా?” అంటూ శనివారం కమిషనర్‌ను అభ్యర్థించిన ఇద్దరు భిక్షాటన చేసే చిన్నారులు పెంచలయ్య, వెంకటేశ్వర్లకు అడ్మిషన్లు కల్పించి అండగా నిలిచారు లోకేష్‌. తన చేతుల మీదుగా అడ్మిషన్ ఫాంలు అందజేశారు. చిన్నారుల విద్యాభ్యాసానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చాను. చిన్నారులు కష్టపడి బాగా చదువుకోవాలని, భవిష్యత్‌లో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ.. వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు నారా లోకేష్‌. ఈ స్థాయిలో విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన లోకేష్‌పై బురదజల్లాలని చూస్తే.. అది ఆకాశం మీద ఉమ్ము వేసినట్లే అవుతుందని వైసీపీ నేతలు తెలుసుకుంటే మంచిదంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే బురద ప్రయత్నాలు చేసి ఎదురుదెబ్బలు తిన్నారనీ, ఇకనైనా లోకేష్‌ – విద్యాశాఖ విషయంలో వైసీపీ నేతలు ఆచి తూచి మాట్లాడాలని సూచిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *