Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకంపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మొదటి విడత కింద ఎంతో మంది తల్లుల ఖాతాల్లో రూ.13,000 చొప్పున నగదు జమ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు రెండో జాబితాను విడుదల చేసింది.
ఎవరికీ లభిస్తుంది ఈ సాయం?
ప్రస్తుతం పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరుతున్న పిల్లలకు ఈ పథకం కింద నగదు లభించనుంది. అలాగే, మొదటి విడతలో డబ్బులు అందని అర్హులైన తల్లులకు కూడా ఈ నెల 5వ తేదీన డబ్బులు ఖాతాల్లోకి వస్తాయి అని అధికారులు తెలిపారు.
రెండో జాబితాలో మీ పేరు ఉందా? చెక్ చేసుకునే 2 మార్గాలు👇
-
వెబ్‌సైట్ ద్వారా చెక్ చేయాలి అంటే:
-
https://gsws-nbm.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
-
“తల్లికి వందనం” పథకాన్ని సెలెక్ట్ చేయండి.
-
విద్యార్థి తల్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
-
అర్హత ఉందో లేదో మీకు స్పష్టంగా తెలుస్తుంది.
-
-
వాట్సాప్ ద్వారా తెలుసుకోవాలంటే:
-
మన మిత్ర సేవా నంబర్ +91 95523 00009 కు మెసేజ్ పంపి మీ పేరు జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోండి.
-
మరో ముఖ్యమైన విషయం…
రాష్ట్రంలోని పాఠశాలల్లో త్వరలో తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పథకం అమలుపై ఫీడ్‌బ్యాక్ తీసుకోవచ్చు. ప్రభుత్వం ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని ప్రయత్నిస్తోంది. అర్హులైనప్పటికీ డబ్బులు రాకపోతే మీ వార్డు/గ్రామ సచివాలయం వద్ద ఫిర్యాదు చేయవచ్చు.
