CM Revanth: మహా న్యూస్‌పై దాడి అప్రజాస్వామిక ఘటన

CM Revanth: మహా న్యూస్‌ పై కార్యాలయంపై జరిగిన దాడిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై తన స్పందనను ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా వ్యక్తం చేశారు.

మీడియా సంస్థపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించిన సీఎం రేవంత్‌, “ఇది అత్యంత హేయమైన చర్య. ఇటువంటి దాడులకు ప్రజాస్వామ్యంలో ఏమాత్రం స్థానం లేదు. నేను దీన్ని గట్టిగా ఖండిస్తున్నాను” అని స్పష్టం చేశారు.

ఇదే అంశంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా స్పందించారు. ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్) వేదికగా ఆయన ట్వీట్ చేస్తూ, “ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు. మీడియా సంస్థలపై దాడులు చేయడం అంటే ప్రజల అభిప్రాయ స్వేచ్ఛను అణచివేయాలనే దురుద్దేశాన్ని కలిగిన చర్య” అని వ్యాఖ్యానించారు.

ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా ఉంటాయని, నగర శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని రెండు నేతలు హెచ్చరించారు. దాడికి పాల్పడినవారితో పాటు, దాని వెనుక నిలిచిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు తక్షణమే స్పందించాలని వారు సూచించారు.

“ఇలాంటి హింసాత్మక చర్యలను ఏ క్షణమైనా సహించబోము. ప్రజాస్వామ్య విలువలను కాపాడటమే మనందరి సామూహిక బాధ్యత” అని వారు ఉద్ఘాటించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *