Sathi Leelavathi: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ‘సతీ లీలావతి’. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని భావోద్వేగంతో పాటు వినోదాత్మకంగా చూపించే ఈ సినిమా, విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల జీవన ప్రయాణాన్ని హృద్యంగా ఆవిష్కరిస్తుంది.
Also Read: Mega 157: మెగా స్పీడులో మెగా 157.. హై వోల్టేజ్ షూట్ కంప్లీట్!
Sathi Leelavathi: చిత్రీకరణ పూర్తైన ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. శరవేగంగా పనులు జరుగుతుండగా, త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఫీల్‌గుడ్ మూవీగా ఈ చిత్రం రూపొందుతోంది. మిక్కీ జే మేయర్ సంగీతం, బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ, సతీష్ సూర్య ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. ఉదయ్ పొట్టిపాడు మాటలు, కోసనం విఠల్ ఆర్ట్ ఈ సినిమాకు అదనపు బలాన్ని అందిస్తున్నాయి. ‘సతీ లీలావతి’ ఫస్ట్ లుక్ విడుదలై, ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
View this post on Instagram
