Rambabu Navarasalu

Rambabu Navarasalu: ఎవరు ఏమనుకున్నా డోన్ట్ కేర్!

Rambabu Navarasalu: అంబటి రాంబాబు నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారు. కాంగ్రెస్‌లో రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన, తిరిగి ఎప్పుడూ ఆ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. వైఎస్‌కు సన్నిహితుడుగా గుర్తింపు ఉంది. వైఎస్ మరణం తర్వాత జగన్‌తో కలిసి అడుగులు వేసారు. పార్టీలో క్రియాశీలకంగా పని చేసారు. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల్లో నాటి జగన్ వేవ్‌, ఒకసారి ఓడిపోయాడన్న సానుభూతి కలిసిరావడంతో అదే సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గెలవగలిగారు. “జనసేన గ్లాసు.. కాకూడదు నా గుండెల్లో బాకు..” అంటూ అప్పటి ఎన్నికల్లో ఊరూరా ప్రాధేయపడుతూ ఓట్లడిగిన రాంబాబు.. కాపు ఓట్లను బాగానే బుట్టలో వేసుకున్నారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక.. రాంబాబు తనదైన స్టైల్‌లో తనలోని అసలు రాంబాబును బయటకు తీసారు. వసూళ్లు.. వివాదాలు.. నడిరోడ్డు పైన డాన్సులు.. మహిళలతో ఫోన్‌లో రహస్య సరస సల్లాపాలు ఆడి ఆడియో కాల్స్‌లో దొరికిపోవడాలు.. ఒక్కటేంటి.. సకలకళా వల్లభుడిగా వెలుగొందారు.

సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏ చిన్న వ్యాపారిని వదల్లేదు. వసూళ్ల కోసం ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గంలో ప్రతీ అధికారిని వేధించి, బెదిరించి పని చేయించుకున్నారు. రాంబాబుపైన ఆ సమయంలో వచ్చిన విమర్శలు, వివాదాలు మరెవరిపైనా లేవనే చెప్పాలి. ఇలా వివాదాలు, వసూళ్లలో టాప్‌లో నిలిచిన అంబటిని నాటి సీఎం ఏరికోరి మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఇంకేముంది.. మనకెవరు అడ్డు అనే తరహాలో వసూళ్ల గేట్లను తెరిచేసారు. బెదిరింపుల పర్వం యధేచ్చగా కొనసాగించారు. సొంత పార్టీ వారిని వదల్లేదు. ఫలితంగా ఎన్నికల్లో సొంత పార్టీ వారు అంబటి వైపు నిలబడలేదు. కసి తీరా ఓడించారు. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. పోలవరంతో సహా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు తనకు లీస్ట్‌ ప్రియార్టీ అన్నట్లు ప్రవర్తించిన జగన్‌ రెడ్డి.. అంబటిని పిలిచి ఇరిగేషన్‌ శాఖను కట్టబెట్టేశారు.

అన్నింటా నాకేంటి.. అసలు నాకేంటి? అని ఆలోచించే అంబటికి అంతటి ఇరిగేషన్ శాఖ అస్సలు అర్దం కాలేదు. అర్దం చేసుకునే ప్రయత్నమూ చేయలేదు. విమర్శలకు దడిసి.. అర్దం చేసుకోవాలి అనుకునే లోపు ఎన్నికలు వచ్చి ప్రభుత్వం అడ్రస్ గల్లంతు అయింది. ఇక.. సత్తెనపల్లిలో తనకు అవకాశం లేదని అంబటికి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అంతే.. అంబటిని ఇక అక్కడ ఉంచకూడదని నిర్ణయించిన జగన్ గుంటూరుకు మార్చేసారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినా… అంబటి కోసం పట్టుమని పది మంది నిలబడరంటే.. ఆయన నాయకత్వ లక్షణాలు ఏపాటివో అర్దం చేసుకోవచ్చు. పార్టీ కార్యకర్త అయినా, తన కోసం పని చేసిన వారికైనా.. ఏనాడు పది రూపాయలు సాయం చేయలేదట. ఇక.. మగువల విషయంలోనూ అంబటికి మంచి కళా పోషకుడిగా పేరుంది. ఆయన ఆడియోలు వైరల్ అయ్యాయి. కారణమేంటో తెలీదు కానీ.. ఏనాడు అంబటి ఆ ఆడియోలను ఖండించలేదు.

Also Read: Chandrababu Naidu: కుప్పం ఘ‌ట‌న‌పై సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్‌.. మ‌హిళ‌ను చెట్టుకు క‌ట్టేసి కొట్టిన నిందితుల‌ అరెస్టు

Rambabu Navarasalu: ఇక, వైసీపీ గత ఎన్నికల్లో ఓడిన తరువాత అంబటి వైసీపీకి పెద్ద దిక్కుగా మారారు. సఖల శాఖా మంత్రి తర్వాత ఆ స్థాయిలో పని చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా వివాదం చేస్తేనే.. తనకు గుర్తింపు వస్తుందనే విధంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులతో.. అధికారులతో.. ప్రజా ప్రతినిధులతో అందరితోనూ వివాదాలే. నడి రోడ్డుపైన శాంతి భద్రతల నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై దూషణలకు దిగారు. నిత్యం పార్టీ కార్యాలయంలో ప్రెస్మీట్లు పెట్టి.. అర్దం పర్దం లేని వాదనలతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేయబోయి.. తానే దొరికిపోవటం.. మిస్ ఫైర్ అవటం అంబటికి కామన్ అయిపోయింది. అయితే, మన రాంబాబు అవన్నీ పట్టించుకోరు. నిత్యం మీడియాలో ఉండాలి. వివాదాలు కావాలి. తాను చెప్పదలచుకున్నది చెప్పాలి. ఎవరు ఏమనుకున్నా డోన్ట్ కేర్ అనుకుంటారు.

దాదాపు మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం. అయితే, ఎందుకు రాజకీయాల్లో ఉన్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్న నాయకుడిగా మాత్రం అంబటి రాంబాబు.. ఏపీ చరిత్రలో నిలిచిపోవటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *