Hebba Patel: చేతన్ కృష్ణ, హెబ్బా పటేట్ జంటగా నటించిన ‘ధూం ధాం’ నవంబర్ 8న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ పతాకంపై సాయికిషోర్ మచ్చా దర్శకత్వంలో ఎ.ఎస. రామ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్, వెన్నెల కిశోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీ మోహన్ కథ, స్క్రీన్ ప్లే సమకూర్చిన ఈ సినిమా ప్రీమియర్ షోను పది రోజుల ముందే ప్రదర్శించటం విశేషం. వైజాగ్ మద్దిల పాలెం లోని సి.ఎం.ఆర్ సెంట్రల్ లో ఉన్న ఐనాక్స్ లో ‘ధూం ధాం’ పెయిడ్ ప్రీమియర్ ప్రదర్శిస్తుండటం విశేషం. గోపీసుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన లభించటం గమనార్హం. డైరెక్టర్ మారుతి విడుదల చేసిన టీజర్ కి కూడా హ్యూజ్ రెస్పాన్స్ రావటంతో సినిమా విజయంపై యూనిట్ కాన్ఫిడెన్స్ తో ఉంది. మరి వారి నమ్మకాన్ని ‘ధూం ధాం’ ఎంత వరకూ నిలబెడుతుందో చూడాలి.
