Siricilla

Siricilla: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైన మరో యువకుడు

Siricilla: ఆన్‌లైన్ బెట్టింగ్ మహమ్మారికి మరో నిండు ప్రాణం బలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా, దేశాయిపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ (20) అనే యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై ప్రాణాలు తీసుకున్నాడు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి, కారు మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వంశీ ఆత్మహత్య స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

గత మూడేళ్లుగా వంశీ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుంటూ వచ్చాడు. ఈ వ్యసనం కోసం స్నేహితులు, తెలిసిన వారి వద్ద దాదాపు రూ. 10 లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలుస్తోంది. వంశీ అప్పుల విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. వారు అతన్ని మందలించారు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన వంశీ, తన పొలం వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: Kavita: ఎమ్మెల్సి కవిత అరెస్టు..

Siricilla: ఈ ఘటనతో వంశీ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీసులు, కుటుంబ సభ్యులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల కారణంగా యువత జీవితాలు నాశనం అవుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Khammam: సెల్పీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్య..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *