virat kohli Pub:

virat kohli Pub: విరాట్ కోహ్లీ ప‌బ్‌పై కేసు.. అందుకేనా?

virat kohli Pub: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీకి చెందిన ఓ ప‌బ్‌కు మ‌ళ్లీ అధికారులు నోటీసులు ఇచ్చారు. బెంగ‌ళూరులో ఉన్న వ‌న్ 8 కమ్యూన్ ప‌బ్‌పై సుమోటోగా క‌బ్బ‌న్ పార్క్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. గ‌తంలో కూడా విరాట్ కోహ్లీ ప‌బ్‌పై ఒక కేసు న‌మోదైంది. మ‌ళ్లీ ఇప్పుడు కోట్పా చ‌ట్టం ప్ర‌కారం కేసు న‌మోద‌వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

virat kohli Pub: కోహ్లీకి చెందిన వ‌న్ 8 కమ్యూన్ ప‌బ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన‌ట్టు నోటీసులో పేర్కొన్నారు. ప‌బ్‌లో ధూమ‌పానం చేసేందుకు ప్ర‌త్యేకించి స్మోకింగ్ జోన్ లేనందున ఈ కేసు న‌మోదు చేసిన‌ట్టు పోలీసులు తేల్చారు. ఈ మేర‌కు కోట్పా చ‌ట్టం కింద ఆ కేసును న‌మోదు చేసిన‌ట్టు క‌బ్బ‌న్ పార్క్ పోలీస్ అధికారులు తెలిపారు.

virat kohli Pub: అయితే గ‌తంలో స‌మ‌యానికి మించి ప‌బ్‌ను న‌డుపుతుండ‌టం వ‌ల్ల ఇదే విరాట్ కోహ్లీ ప‌బ్‌పై కేసు న‌మోదైంది. జూన్ నెల‌లో వ‌న్ 8 ప‌బ్‌పై ఈ కేసు న‌మోదైంది. అందేవిధంగా ఫైర్ సేఫ్టీ ఉల్లంఘ‌న విష‌యంలోనూ ఇదే ప‌బ్‌పై గ‌తంలో మ‌రో కేసు న‌మోదైంది. తాజాగా స్మోకింగ్ ఏరియా లేని కార‌ణంగా కేసు న‌మోదైంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Liquor Ban: మద్యనిషేధం ఆ అధికారులకు వరం.. కోర్టు సంచలన వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *