Gaddar Film Awards

Gaddar Film Awards: గద్దర్ అవార్డుల ప్రకటన: 2014-2023 వరకూ ఉత్తమ సినిమాలు ఇవే!

Gaddar Film Awards: 14 ఏళ్ల విరామం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సినీ అవార్డులను మళ్లీ అందజేయనుంది. ఈసారి వీటిని ప్రజాప్రియ పోరాట గాయకుడు గద్దర్ పేరుతో అందించనున్నారు. 2014 నుంచి 2023 మధ్యకాలంలో విడుదలైన ఉత్తమ చిత్రాలకు ఈ అవార్డులు ప్రకటించారు.

జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడిన తర్వాత సెన్సార్ అయిన తెలుగు సినిమాల నుంచే ఎంపిక చేయబడింది. ప్రతి సంవత్సరానికి మూడు ఉత్తమ చిత్రాలు ప్రకటించారు.

ఈ అవార్డులను గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొన్నారు.

ఉత్తమ చిత్రాల అవార్డులు (2014–2023)

2014

  • రన్ రాజా రన్
  • పాఠశాల
  • అల్లుడు శ్రీను

2015

  • రుద్రమదేవి
  • కంచె
  • శ్రీమంతుడు

2016

  • శతమానం భవతి
  • పెళ్లి చూపులు
  • జనతా గ్యారేజ్

2017

  • బాహుబలి: ది కన్‌క్లూజన్
  • ఫిదా
  • ఘాజీ

2018

  • మహానటి
  • రంగస్థలం
  • కేరాఫ్ కంచరపాలెం

2019

  • మహర్షి
  • జెర్సీ
  • మల్లేశం

2020

  • అలా వైకుంఠపురంలో
  • కలర్ ఫొటో
  • మిడిల్ క్లాస్ మెలోడీస్

2021

  • ఆర్‌ఆర్‌ఆర్
  • అఖండ
  • ఉప్పెన

2022

  • సీతా రామం
  • కార్తికేయ 2
  • మేజర్

2023

  • బలగం
  • హనుమాన్
  • భగవంత్ కేసరి

Also Read: Khaleja: ఖలేజా రీరిలీజ్ షాక్.. ఫ్యాన్స్‌కు ఊహించని ట్విస్ట్!

ప్రత్యేక జ్యూరీ అవార్డులు

జ్యూరీ ప్రత్యేకంగా ఎనిమిదిగురు సినీ ప్రముఖులకు అవార్డులు ప్రకటించింది:

ఎన్‌టీఆర్ నేషనల్ అవార్డు – నందమూరి బాలకృష్ణ

బి.ఎన్. రెడ్డి అవార్డు – దర్శకుడు సుకుమార్

పైడి జయరాజ్ అవార్డు – మణిరత్నం

నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు – అట్లూరి పూర్ణచంద్రరావు

కాంతారావు అవార్డు – విజయ్ దేవరకొండ

రఘుపతి వెంకయ్య అవార్డు – రచయిత యండమూరి వీరేంద్రనాథ్

Gaddar Film Awards: ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ, గత 10 ఏళ్లుగా ప్రభుత్వాలు సినీ అవార్డులను పట్టించుకోలేదని, తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గద్దర్ పేరిట అవార్డులు అందిస్తున్నట్టు తెలిపారు. జూన్ 2, 2014 నుండి 2023 వరకు సెన్సార్ ధృవీకరణ పొందిన చిత్రాలనుంచి ప్రతి ఏడాదికి మూడు ఉత్తమ సినిమాలను ఎంపిక చేసి అవార్డులు ప్రకటించారని తెలిపారు. తెలుగు సినీ రంగానికి ఇది ఒక ప్రోత్సాహకరమైన అభివృద్ధిగా భావిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *