Lokesh Mahaa Saval: టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతాడనుకుంటున్న లోకేష్.. రాజీనామా చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కడప మహానాడులో. లోకేష్ వ్యాఖ్యలకు తమ్ముళ్లు టాప్ లేచిపోయేలా విజిల్స్ వేశారు. దాంతో కడపలో జగన్ డెన్ ఉలిక్కిపడిందట. అదేంటి అనుకుంటున్నారా? ఎందుకంటే లోకేష్ వ్యాఖ్యలు స్టేట్మెంట్ కాదు. సవాల్. జగన్‌కి జగన్ అడ్డాలోనే నిలబడి విసిరిన పవర్ ఫుల్ సవాల్. తన సింహగర్జనతో లోకేష్.. అబద్దాల వైసీపీని చితక్కొట్టి.. హీరో అనిపించుకున్నారంటూ తమ్ముళ్లు ఖుషీ అవుతున్నారు. 20 లక్షల ఉద్యోగాల హామీతో రాయలసీమను సుభిక్షం చేస్తామన్న లోకేష్.. తెలుగుదేశం కార్యకర్తలు అంజిరెడ్డి, మంజుల, చంద్రయ్యల స్ఫూర్తిని ఆకాశానికెత్తారు. వైసీపీ ఓటమిని గుర్తు చేస్తూ.. జగన్‌పై సెటైర్లు పేల్చారు. మొత్తంగా మహానాడు వేదికపై లోకేష్ తన ఆల్రౌండ్ యాక్షన్, ఫర్ఫెక్షన్‌తో అదరగొడుతున్నారు.
జగన్ సొంత గడ్డపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ మంత్రి నారా లోకేష్ జగన్ అబద్ధాలపై విరుచుకుపడ్డారు. ఉర్సా క్లస్టర్స్‌కు కూటమి ప్రభుత్వం ఎకరం భూమిని 99 పైసలకే కట్టబెట్టిందన్న వైసీపీ అధినేత జగన్ ఆరోపణలను లోకేష్ సవాల్‌తో సమాధి చేశారు. “ఆ ఆరోపణ నిజమని జగన్ నిరూపిస్తే.. నేను రాజీనామా చేస్తా,” అంటూ ఛాలెంజ్ చేశారు. మార్కెట్ విలువ ప్రకారమే భూములు కేటాయించామని, జగన్ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. దొంగే దొంగ అన్నట్లు జగన్ వైఖరి ఉందంటూ ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కామ్‌లో 10 వేల కోట్లకు పైగా దోచుకున్న జగన్.. అబద్ధాలతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని లోకేష్ దుయ్యబట్టారు. పాడిందే పాటరా.. పాచి పళ్ల దాసరి అన్నట్లు ఉర్సా క్లస్టర్స్‌పై వైసీపీ మొదట్నుంచీ ఇకే దుష్ప్రచారం చేస్తోంది. ఉర్సా క్లస్టర్స్‌కు ఎకరం భూమి 99 పైసలకు ఇచ్చినట్లు ఎలాంటి ఆధారం లేదు.
ఇది కూడా చదవండి: Corona Virus: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఇంత తొందరగా పెరగడానికి కారణమేంటీ?
కూటమి ప్రభుత్వం మార్కెట్ విలువ ప్రకారం పారదర్శకంగా భూములు కేటాయించిందని అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ అబద్ధ ప్రచారం వైసీపీ ఓటమి తర్వాత.. కూటమి ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు, రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకుండా అడ్డుకునేందుకు చేస్తున్న కుట్రలో భాగమేనంటున్నారు తెలుగుదేశం లీడర్స్. తాజా ప్రెస్‌మీట్‌లో జగన్ మోహన్ రెడ్డి అవే అబద్దాలు పట్టుకొచ్చి, ఉర్సా క్లస్టర్స్‌కు 99 పైసలకే భూమి ఇచ్చారంటూ నిస్సిగ్గుగా అబద్ధం ఆడారని మండిపడుతున్నారు. వైసీపీ పదేపదే అసత్యాలను ప్రచారం చేస్తూ, జగన్ మళ్లీ మళ్లీ అదే అబద్ధాలను వల్లెవేస్తూ, రాజకీయంగా బతకాలని చూస్తున్నారు కానీ, లోకేష్ ఈ అబద్ధాలను కడపలోనే సమాధి చేశారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.
జగన్ ఆరోపించినప్పుడే లోకేష్ ఘాటుగా సమాధానం చెప్పి ఉండొచ్చు కానీ.. బట్ట కాల్చి మొహాన వేయడం, తర్వాత తుర్రుమనడం వైసీపీకి మొదట్నుంచీ ఉన్న అలవాటని పరిశీలకుల్లో ఉన్న అభిప్రాయం. నాలుగు రోజులకోసారి ఏపీకొచ్చి, ప్రెస్మీట్ లాంటిది కండక్ట్ చేసి, స్కిప్ట్ పట్టుకుని, చేయాల్సిన ఆరోపణలు చేసి, ఆ వెంటనే బెంగళూరు ప్యాలెస్‌కి వెళ్లిపోతుంటారు జగన్. అందుకే లోకేష్ స్పందించి సమయం వృధా చేసుకోలేదు. సరైన సమయంగా మహానాడు వేధికను ఎంచుకున్నారు. జగన్ అడ్డాలో నిలబడి లోకేష్ విసిరిన ఛాలెంజ్‌తో.. ఇకపై ఉర్సా గురించి మాట్లాడే నైతికత, అర్హత వైసీపీ, జగన్ కోల్పోతారనీ… ఇది లోకేష్ వేసిన అద్భుత రాజకీయ ఎత్తుగడ అని అనలిస్టులు భావిస్తున్నారు. ఇకపై ఉర్సాపై ఏడ్వాలంటే.. జగన్ లోకేష్ ఛాలెంజ్‌ని స్వీకరించాలి. లేదంటే… తప్పుడు సమాచారంతో తప్పుడు ఆరోపణలు చేశానని అంగీకరించి సారీ చెప్పాలి. ఈ రెండు జగన్ చేస్తారని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. మరి ఇకపై వైసీపీ ఈ అంశంలో ఎలా ముందుకెళ్తుందో వేచి చూడాలి.