Green Tax Pawan

Green Tax Pawan: ఆ డ్రైవర్‌ అన్నకి ఇచ్చిన మాట.. నిలబెట్టుకున్న పవన్‌

Green Tax Pawan: ఓ సామాన్యుడి ఆవేదన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ వరకూ వచ్చింది అంటే.. అది ఆయన్ను కదిలించింది అంటే.. దాన్ని ఎప్పటికీ మర్చిపోరాయన. అధికారం ఉన్నా, లేకపోయినా ఆ బాధితులను తన గుండెల్లో పెట్టుకుంటారు. అధికారంలోకి రాకముందు కొన్నేళ్ల క్రితం విశాఖ ఏజెన్సీలోని ఓ మారుమూర గ్రామానికి వెళ్లి.. అక్కడి గిరిజనులకు హామీ ఇస్తే.. అధికారంలోకి వచ్చాక గుర్తుపెట్టుకుని మరీ ఆ గ్రామంలో పర్యటించారు. డిప్యూటీ సీఎం హోదాలో వారి బాగోగులన్నీ చూసుకున్నారు. దీంతో ఆ ఏజెన్సీ గ్రామానికి ఇప్పుడు మంచి రోజులొచ్చాయ్‌. ఇలాంటి సంఘటనలు ఎన్నో.

జనసేనాని పవన్ కళ్యాణ్..! ఒక సామాన్యుడి ఆవేదనను అర్థం చేసుకునే నాయకుడు. ఆయన హామీ బాధితులకో కవచం. ఎవ్వరూ పట్టించుకోని విశాఖ ఏజెన్సీలోని ఆ మారుమూల గిరిజన గ్రామాన్ని పవన్‌ కళ్యాణ్‌ పట్టించుకున్నారు. ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చారు. ఇప్పుడు లారీ యజమానుల జీవితాల్లో వెలుగులు నింపారు. గ్రీన్ టాక్స్ భారంతో అల్లాడిన లారీ యజమానుల కోసం ఆయన స్పందన అప్పట్లో ఓ సంచలనం. 2024 ఎన్నికలకు ముందు, వారాహి యాత్రలో ఉండగా… ఓ లారీ డ్రైవర్ పవన్ కళ్యాణ్‌ను కలిశాడు. ఏపీలో గ్రీన్ టాక్స్ భారం తమ జీవితాలకు పెనుభారంగా ఉందని, తమిళనాడులో రూ.200, తెలంగాణలో రూ.500 ఉంటే, ఏపీలో రూ.6,600 వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ క్షణంలో పవన్ కళ్యాణ్ మనసు చలించింది. మీ బాధ నాదంటూ హామీ ఇచ్చాడు. ఈ సంఘటన అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, జన హృదయాలను తాకింది.

Also Read: Harvard University: హార్వర్డ్‌పై ట్రంప్‌ ఆంక్షలు: విదేశీ విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో

Green Tax Pawan: పవన్ తన మాటను మర్చిపోలేదు. జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి మేనిఫెస్టోలో గ్రీన్ టాక్స్ తగ్గింపు హామీని చేర్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే, డిప్యూటీ సీఎంగా ఆ హామీని నిజం చేశాడు. మే 20, 2025న జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో గ్రీన్ టాక్స్‌ను భారీగా తగ్గించే నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో ఏడాదికి రూ.20,000 వరకు వసూలైన టాక్స్, ఇప్పుడు రూ.1,500 నుండి 3,000కి తగ్గింది. ఈ నిర్ణయం లారీ యజమానులకు, రవాణా వాహనదారులకు భారీ ఊరటనిచ్చింది. రవాణా శాఖ త్వరలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనుంది.

గత వైసీపీ ప్రభుత్వం ఏడేళ్లు దాటిన వాహనాలపై గ్రీన్ టాక్స్‌ను భారీగా పెంచింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఈ టాక్స్ విపరీతంగా ఉండేది. ఈ అన్యాయాన్ని గమనించిన పవన్, లారీ డ్రైవర్ల ఆవేదనను తన గుండెల్లో నింపుకున్నారు. ఆయన నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ భారాన్ని తొలగించింది. లారీ యజమానులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ, పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గ్రీన్‌ ట్యాక్స్‌ హామీ అమలు.. ఏదైనా అనుకుంటే దానిని సాధించే వరకూ వదిలిపెట్టని పవన్‌ దృఢ సంకల్పానికి, ప్రజల పట్ల ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ALSO READ  YCP Direction Nani Game: బాబుపై ప్రేమ, తమ్ముడిపై ద్వేషం - వాటే గేమ్‌!

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *