Cm revanth: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో సరస్వతీ నదీ పుష్కరాల సందర్భంగా పుణ్యస్నానం చేశారు. ఆయనతో కలిసి మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, శాసన సభ్యులు కూడా పుష్కర స్నానంలో పాల్గొన్నారు.
పుష్కర స్నానానంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్ఞాన సరస్వతి దేవి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, దేశ ప్రజల సుస్థిర భవిష్యత్తు కోసం ప్రార్థనలు చేశారు.
కాళేశ్వరం ముక్తేశ్వర క్షేత్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానంలో శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. అనంతరం సాయంత్రం జరిగిన సప్త హారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాల నిర్వహణకు చేసిన ఏర్పాట్లపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల సౌకర్యం కోసం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
