Mohanlal

Mohanlal: మోహన్‌లాల్ మాస్ కంబ్యాక్: 500 కోట్ల బాక్సాఫీస్ ఊచకోత!

Mohanlal: మలయాళ సినిమా సూపర్ స్టార్ మోహన్‌లాల్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు! ఈ ఏడాది నెల వ్యవధిలోనే ‘ఎంపురాన్’, ‘తుడరుం’ అనే రెండు భారీ చిత్రాలను రిలీజ్ చేసిన మోహన్‌లాల్, రెండింటితోనూ బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నారు. ‘ఎంపురాన్’ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ సాధించగా, ‘తుడరుం’ 200 కోట్ల క్లబ్‌లో చేరి సత్తా చాటింది. ‘బరోజ్’ లాంటి డిజాస్టర్ తర్వాత వరుసగా రెండు భారీ విజయాలతో మోహన్‌లాల్ సెన్సేషనల్ కంబ్యాక్ సాధించారని చెప్పొచ్చు.
మలయాళ సినిమా ఇండస్ట్రీకి భారీ రెవెన్యూని అందించిన ఈ చిత్రాలు, మోహన్‌లాల్ స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపించాయి. ‘తుడరుం’ చిత్రానికి తరుణ్ మూర్తి దర్శకత్వం వహించగా, జేక్స్ బిజోయ్ సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. మోహన్‌లాల్ ఈ జోరుతో మరిన్ని హిట్స్ అందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మరి, ఈ స్టార్ హీరో తదుపరి ప్రాజెక్ట్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *