ATP Kesavareddy TDP

ATP Kesavareddy TDP: టీడీపీ వ్యూహం: రాయలసీమ రెడ్లకు పదవులు!

ATP Kesavareddy TDP: ఏపీలో 2024 ఎన్నికల్లో కూటమి వేవ్‌లో వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. రాయలసీమ జిల్లాల్లో మాకు తిరుగులేదు అనుకున్న వైసీపీకి గట్టి ఎదుటిదబ్బే తగిలింది. 52 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం సింగిల్ డిజిట్.. ఏడు సీట్లకే పరిమితమైంది. ఎన్నికలు జరిగి ఏడాది అవుతున్న వైసీపీ ఇప్పట్లో పుంజుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇదే ఊపులో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడానికి టీడీపీ వ్యూహాత్మకంగా వెళ్తోంది. ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి అనే విధంగా.. సీమ జిల్లాల్లో నామినేటెడ్ పదవుల ద్వారా చంద్రబాబు అలాంటి మాస్టర్ ప్లానే వేశారంట. ఇందులో భాగంగానే సహకార బ్యాంక్ చైర్మన్ పదవులు పక్కా ప్రణాళికతో రెడ్లకు కేటాయించారు సీఎం చంద్రబాబు. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా రెడ్లకు ఈ పదవులు దక్కాయి. ఇక అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా ముంతిమడుగు కేశవరెడ్డిని ఎంపిక చేశారు.

రెండు దశాబ్దాలుగా టిడిపి పార్టీని నమ్ముకుని, పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా పార్టీ మారకుండా పార్టీ బలోపేతానికి కృషి చేసి.. తన నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గెలవడానికి కీలక పాత్ర పోషించిన మంతిమడుగు కేశవరెడ్డిని అధిష్టానం గుర్తించి ఆయనకు జిల్లా సహకార బ్యాంకు చైర్మన్‌గా నియమించింది. పార్టీ కోసం కష్టపడి క్రమశిక్షణతో పనిచేసే వారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయని టీడీపీ మరోసారి నిరూపించుకుంది. ఒకవైపు రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తూ, మరోవైపు సామాజిక సేవలు చేస్తూ జిల్లాలో మంచి పేరు సంపాదించుకున్నారు ముంతిమడుగు కేశవరెడ్డి. ఆయన సింగనమల టీడీపీ ద్విసభ్య కమిటీ సభ్యుడుగా ఉన్నారు. తన రాజకీయ జీవితం ప్రారంభం నుండి నేటి వరకు, ఆయన ప్రజల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తూ, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతూ, తనకు కేటాయించిన పదవుల ద్వారా సమాజానికి సేవ చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి సీఎం చంద్రబాబు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్‌గా నియమించారు.

Also Read: Jagan Time to go Gail: అదానీ స్కామ్‌లో మిస్‌.. లిక్కర్‌ స్కామ్‌లో ఫిక్స్‌!

ATP Kesavareddy TDP: టిడిపిలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది అనడానికి ముంతిమడుగు కేశవరెడ్డి ఒక ఉదాహరణ. రెండు దశాబ్దాలుగా ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేస్తున్న నేపథ్యంలో టిడిపి అధిష్టానం నేడు ఆయనకు పట్టం కట్టింది. పేద ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం దక్కిందని సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు కేశవరెడ్డి. సింగనమల నియోజకవర్గంలో టీడీపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అంటున్నారాయన.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *