Yuvakudu Suside

Yuvakudu Suside: ఇల్లు రాలేదని పురుగులమందు తాగిన యువకుడు..

Yuvakudu Suside : ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా నుంచి కాంగ్రెస్‌ నాయకులు, అధికారులు తన పేరును తొలగించారనే మనస్తాపంతో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లికి చెందిన కుమ్మరి రవీందర్‌ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఇల్లులేని నిరుపేదల కోసం రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ ఇంటి పథకం అమలుచేస్తోంది. ప్రతి పల్లెలోనూ గ్రామ కమిటీ ఖరారుచేసిన వారికే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని నిబంధన కూడా పెట్టింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామ కమిటీ ఎంపిక చేసిన 27 మందితో కూడిన తొలి జాబితాలో కుమ్మరి రవీందర్‌ అనే వ్యక్తి పేరు ఉంది.

Also Read: Crime News: పిల్ల‌లు క‌ల‌గ‌డం లేద‌ని భార్య‌ను ఏం చేశాడో చూడండి? జ‌గిత్యాల జిల్లాలో దారుణం

Yuvakudu Suside : కానీ ఇళ్ల సంఖ్య పదికి తగ్గించాలని ఆదేశాలు రావడంతో ఆయన పేరును తొలగించారు. దీంతో తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని మనస్తాపంతో రవీందర్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రవీందర్‌కు భార్య కళావతితోపాటు ఇద్దరు పిల్లలున్నారు. గ్రామంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న రవీందర్‌ సొంతిల్లు లేకపోవడంతో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, గ్రామ కమిటీ వల్లే తనకు ఇల్లు దక్కడం లేదని తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Crime News: హైదరాబాద్‌లో దారుణం: ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం, హత్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *