TTD Key Decision

TTD Key Decision: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి భక్తులకు సూపర్ పవర్స్..

TTD Key Decision: శ్రీవారి దర్శనానికి తరలివస్తున్న లక్షలాది భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో వినూత్న చర్య చేపట్టింది. భక్తుల అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు, వారి అభిప్రాయాలను సులభంగా సేకరించేందుకు టీటీడీ తాజాగా వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది.

ఈ ఫీచర్‌ను ఉపయోగించేందుకు తిరుమల, తిరుపతి పరిధిలోని అనేక ప్రాంతాల్లో ప్రత్యేక క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేశారు. భక్తులు తమ మొబైల్‌ ఫోన్‌లతో స్కాన్ చేసిన వెంటనే వాట్సాప్‌లో టీటీడీ ఫీడ్‌బ్యాక్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ వారు తమ పేరుతో పాటు, అనుభవాలను వివరిస్తూ అభిప్రాయాన్ని పంపించవచ్చు.

భక్తులు అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ, లగేజీ సేవలు, దర్శనం, గదులు, కాలిన నడక మార్గం, క్యూలైన్‌లో ఎదురైన అనుభవాలపై అభిప్రాయం తెలియజేయవచ్చు. వీటిని టెక్స్ట్ రూపంలో గానీ లేదా వీడియో రూపంలో గానీ సమర్పించవచ్చు. సేవా ప్రమాణాన్ని “ఉత్తమం”, “సగటు”, “మెరుగుదల అవసరం”, “బాగాలేదు” అనే విభాగాల్లో రేట్ చేయాల్సి ఉంటుంది.

అభిప్రాయాన్ని గరిష్టంగా 600 అక్షరాలలో నమోదు చేయడం లేదా వీడియోగా అప్‌లోడ్ చేయడం భక్తులకు సాధ్యమవుతుంది. అభిప్రాయం పంపిన వెంటనే ధృవీకరణ సందేశం వస్తుంది: “మీ అభిప్రాయం విజయవంతంగా నమోదు చేయబడింది. మీ విలువైన ఫీడ్‌బ్యాక్‌కు ధన్యవాదాలు.”

ఇది కూడా చదవండి: Zameer Ahmed: భార‌త్‌, పాక్ వివాదంపై క‌ర్ణాట‌క మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఈ చర్యపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తమ అనుభవాలను అధికారులకు తెలిపే అవకాశం లేకపోవడంతో ఎంతోమంది అసంతృప్తితో తిరిగిపోయేవారు. అయితే ఈ నూతన ఫీడ్‌బ్యాక్ విధానం ద్వారా తమ సమస్యలు, సలహాలను నేరుగా టీటీడీకి చెప్పే వీలవడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

భవిష్యత్తులో భక్తుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా టీటీడీ సేవల ప్రమాణాన్ని మరింత మెరుగుపరిచే అవకాశం ఉంది. భక్తుల సమస్యలపై నేరుగా స్పందించే ఈ కొత్త విధానం ద్వారా తిరుమలలోని సేవల నాణ్యత పెరుగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *