Andrew

Andrew: దర్శకుడుగా మారిన మరో సినిమాటోగ్రాఫర్

Andrew: టాలీవుడ్ లో మరో సినిమాటోగ్రాఫర్ మెగాఫోన్ పట్టాడు. ‘డార్లింగ్, కందిరీగ, గుండెజారి గల్లంతయిందే, ఉల్లాసంగా ఉత్సాహంగా, మసాల, చక్కరకట్టి, చిన్నదాన నీకోసం, ఒక లైలా కోసం, ఒక్కడినే’ తో పాటు పలు భాష్లలో దాదాపు 35 చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన ఆండ్రూబాబు డైరెక్టర్ గా మారి ఓ సినిమా చేస్తున్నాడు. అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరితో బిగ్ మూవీ మేకర్స్, మై త్రీ ఆర్ట్స్ పై లండన్ గణేశ్, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి వూట్ల నిర్మిస్తున్న సినిమాకు ఆండ్రూ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. 

బూమరాంగ్, ఫియర్, డ్రీమ్ స్లేయర్స్ ఈ థ్రిల్లర్ మూవీ షూటింగ్ లండన్ లో జరుగుతోంది. ఈ మూవీకి డైరెక్షన్ చేయటంతో పాటు కెమెరామేన్ గా ను బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆండ్రూ. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీలో వైవాహర్ష, వెన్నెల కిశోర్, నివాసిని, షకలక శంకర్, మహేందర, రెడిన్ కింగ్సీ ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ సినిమా టైటిల్ ను త్వరలోనే ప్రకటించనున్నారు. మరి తొలి సారి మెగాఫోన్ పట్టిన ఆండ్రూకి ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *