Bael Leaves Benefits: బిల్వ ఆకు గురించి అందరికీ తెలిసిందే. ఇది శివుడికి చాలా ప్రియమైనది. భక్తులు బిల్వ ఆకులతో శివుడిని పూజిస్తారు. కానీ అది కేవలం పూజ కోసం మాత్రమే కాదు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కాబట్టి ఇది ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందో తెలుసుకుందాం..
వేసవిలో ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో రెండు బిల్వ ఆకులు తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆకులను నమిలి తినవచ్చు లేదా కషాయాల రూపంలో తీసుకుంటే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
ఇది కూడా చదవండి: Vastu Tips: ఈ దిక్కులో స్టవ్ పెట్టండి.. వద్దన్నా డబ్బులు వస్తూనే ఉంటాయి
బిల్వా ఆకులు కాల్షియం, ఫైబర్, విటమిన్లు A, C, B1, B6 వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ ఆకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
బిల్వ ఆకులు హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అదనంగా ఈ ఆకులను రోజూ తినడం వల్ల బిపి తగ్గుతుంది. గుండె సంబంధిత సమస్యలు ఉండవు. అలాగే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి ఉదయం ఆకులను నమలడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలోని యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మ సమస్యలను దూరంగా ఉంచుతాయి.

