Vijay Sethupathi: పూరి జగన్నాథ్ మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు.‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి డిజాస్టర్ల తర్వాత ఆయన కొత్త సినిమాతో రంగంలోకి దిగుతున్నారు. ఇటీవల ఉగాది పర్వదినం సందర్భంగా పూరి కనెక్ట్స్ నిర్మాణ సంస్థ ఓ బిగ్ అప్డేట్ విడుదల చేసింది. ఈసారి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా ఓ కొత్త సినిమా తెరకెక్కనుంది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. నేటి రాజకీయాలపై కత్తి లాంటి సెటైర్లతో నిండిన చిత్రం కానుందని టాక్ వినిపిస్తోంది.పూరి జగన్నాథ్ సినిమా అంటేనే డైలాగ్స్‌లో డెప్త్, సమాజాన్ని ఆలోచింపజేసే కంటెంట్ ఉంటాయని అందరికీ తెలిసిందే. ఈ కొత్త చిత్రంలోనూ ఆయన నేటి సమాజానికి అద్దం పట్టేలా స్క్రిప్ట్‌ను రెడీ చేసినట్లు సమాచారం. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పొలిటికల్ సెటైర్లు పేల్చడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈసారి పూరి ఏ స్థాయిలో డైలాగ్స్‌తో అలరిస్తాడో చూడాలి.
