BANDI SANJAY: ఆ పార్టీలు దేశా విభజనకు కుట్రలు చేస్తున్నాయి..

BANDI SANJAY : కేంద్ర మంత్రి బండి సంజయ్, ఉగాది పండుగ సందర్భంగా కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దేశ విభజనకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల పేరుతో దేశాన్ని విడగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘‘రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది’’ అని బండి సంజయ్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మతం పేరుతో దేశాన్ని విభజించిందని, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల పేరుతో మరొకసారి దేశాన్ని విభజించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ‘‘కుట్రలు చేస్తున్న వారిని రాళ్లతో కొట్టాలని’’ ఆయన తీవ్రంగా అభిప్రాయపడారు.

అలాగే, కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పగ తీర్చుకునే రాజకీయాలు చేయబోమంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే’’ అని ఆయన అన్నారు.

ప్రజలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని, సన్నబియ్యం ఇస్తున్నట్లు కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని, కానీ కేంద్ర ప్రభుత్వం దానిని అందిస్తోందని బండి సంజయ్ స్పష్టం చేశారు. కేజీ బియ్యం పై కేంద్ర ప్రభుత్వం రూ. 40 ఖర్చు చేస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ. 10 మాత్రమే ఖర్చు చేస్తుందని ఆయన వెల్లడించారు. అందుకే ఈ పథకంపై ప్రధాని మోదీ ఫోటో పెట్టాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *